దుబాయ్‌లో ఉండే ఓ భారతీయుడికి అదృష్టం వరించింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రాలో కోశి వర్గీస్ (48) అనే భారత ప్రవాసుడు ఏకంగా 1 మిలియన్ డాలర్లు (రూ.7.9 కోట్లు) గెలుచుకున్నాడు. దుబాయ్ ఇంటర్నెషనల్ విమానాశ్రయంలో నిర్వహించిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రాలో కోశి విజేతగా నిలిచాడు. కొన్ని వారాల క్రితం అతడు కొనుగోలు చేసిన మిలీనియం మిలియనీర్ సిరీస్ నం. 396, లాటరీ టికెట్ నం.0844 కు ఈ జాక్‌పాట్ తగిలింది. దీంతో రాత్రికి రాత్రే కోశి బ్యాంక్ ఖాతాలోకి రూ.7.9 కోట్లు వచ్చిపడ్డాయి. నేను కొన్ని సంత్సరాలుగా నా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాను. చివరకు నాకు అదృష్టం వరించింది. ఇంత భారీ మొత్తం గెలిచినందుకు ఆనందంగా ఉంది. ఇది జరిగేలా చేసిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ టీమ్‌ని చూడటానికి ఎదురు చూస్తున్నాను అని కోశి చెప్పుకొచ్చాడు.














