మహజూజ్ వీక్లీ లక్కీ డ్రాలో భారత మహిళ ఒకరు జాక్‌పాట్ కొట్టారు. లాటరి టికెట్ కొన్న మొదటిసారినే ఆమెకు ఇలా అదృష్టం వరించడం విశేషం. దీంతో ఆమె లక్ష దిర్హమ్స్ (రూ.20.31 లక్షలు) గెలుచుకున్నారు. ఆమెతో పాటు మరో ఇద్దరు లెబనానీ పౌరులు సైతం చెరో లక్ష దిర్హమ్స్ గెలిచారు. దుబాయ్‌లో నిర్వహించిన మహజూజ్ 52వ వీక్లీ డ్రాలో ఈ ముగ్గురు ప్రవాసులు చెరో రూ.20 లక్షలు గెలుచుకున్నారు. భారత్‌కు చెందిన విద్య (31), లెబనాన్ పౌరులైన సుజానే (52) చార్బెల్ (35) ఈ లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా విద్య మాట్లాడుతూ లాటరీ గెలుచుకోవడం ఆనందంగా ఉందన్నారు. తాను గెలిచిన ప్రైజ్‌మనీలో అధిక భాగం తన కూతురి భవిష్యత్తు కోసం వినియోగిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మహజూజ్ నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)