Namaste NRI

లాటరీలో జాక్ పాట్… 2 దశాబ్దాల తర్వాత మళ్లీ

అమెరికాకు చెందిన ఆల్విన్‌ కోప్‌లాండ్‌ అనే వ్యక్తి 2002లో ఓ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశాడ. ఆ లాటరీ టికెట్‌తో అప్పట్లో ఆయన లక్ష డాలర్లు ( ఇండియన్‌ కరెన్సీలో రూ.76 లక్షలు) గెలుచుకుని లక్షాధికారి అయ్యాడు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆయనను మరోసారి అదృష్టం వరించింది. ఈ సారి జాక్‌పాట్‌ తగలడంతో ఏకంగా కోటీశ్వరుడయ్యాడు. 7 ఎలెవన్‌ స్టోర్‌లో ఆల్విణ్‌ కొనుగోలు చేసిన వర్జీనియా లాటరీకి డిసెంబర్‌ 4న తీసిన డ్రాలో 1 మిలియణ్‌ డాలర్లు (సుమారు రూ.7.6 కోట్లు) తగిలాయి. దీంతో ఆయన ఇంట్లో కాసుల వర్షం కురిసింది. ఈ క్రమంలో స్పందించిన ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events