క్వాంటమ్ స్కేప్ ఫౌండర్ కం మాజీ సీఈఓ జగ్దీప్ సింగ్ ఓ రికార్డు నెలకొల్పారు. ఆయన వార్షిక వేతనం రూ.17,500 (2.06 బిలియన్ల డాలర్లు) కోట్లు. సగటున రోజువారీ ఆదాయం రూ.48 కోట్లు. ఇన్నోవేషన్‌కు మారుపేరుగా నిలిచిన జగ్దీప్సింగ్ కెరీర్ హెచ్‌పీ, సన్ మైక్రోసిస్టమ్స్‌తో ప్రారంభమైంది. 1992లో ఎయిర్‌సాఫ్ట్‌తోపాటు పలు స్టార్టప్ సంస్థలనూ స్థాపించారు. మేరీలాండ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ డిగ్రీ అందుకున్న జగ్దీప్ సింగ్, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి పీజీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఎంబీఏ పూర్తి చేశారు. మంచి విద్యా పునాదులతో విజనరీ ఎంట్రపెన్యూర్‌గా నిలిచారు జగ్దీప్సింగ్.
ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగించే అడ్వాన్స్డ్ బ్యాటరీ టెక్నాలజీ కంపెనీ క్వాంటం స్కేప్ సంస్థను 2010లో స్థాపించా రు. ఫాస్ట్ చార్జింగ్తోపాటు సుదీర్ఘకాలం మన్నికగా ఉండే సేఫర్ బ్యాటరీల తయారీపై క్వాంటస్కేప్ దృష్టి సారించింది. జగ్దీప్ సింగ్ సారధ్యంలో కంపెనీ శరవేగంగా వృద్ధి సాధించింది. ఆయన ప్యాకేజీ 2.3 బిలియన్ డాలర్లు. అయితే, గతేడాది ఫిబ్రవరిలో సంస్థ సీఈఓగా వైదొలిగిన జగ్దీప్ సింగ్.. ఆ స్థానాన్ని శివ శివరామ్‌కు అప్పగించారు. క్వాంటం స్కేప్ బోర్డు డైరెక్టర్‌గా ఉన్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వార్షిక వేతనం రూ.1663కోట్లు. అలవెన్సులు, ఇతర ఆదాయం రూ.1854 కోట్లు. దీని ప్రకారం రోజువారీగా సుందర్ పిచాయ్ వేతనం రూ.5 కోట్లు ఉంటుంది.