చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ పతాకాలపై కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్.బి. చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో సందడి చేయనున్నారు. రాజకీయ నేపథ్య కథతో దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. రాజకీయ నాయకుడు జైదేవ్‌గా సత్యదేవ్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర లుక్‌ను తాజాగా విడుదల చేశారు. జైదేవ్ క్యారెక్టర్‌కు కథలో ప్రాధాన్యత ఉంటుందని చిత్ర బృందం చెబుతున్నారు. మలయాళంలో విజయవంతమైన లూసీఫర్‌కు రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. ఈ చిత్రంలో నయనతార, పూరి జగన్నాథ్, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 5న దసరా సందర్భంగా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: నీరవ్ షా.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)