Namaste NRI

రామ్‌చరణ్‌కు జోడీగా జాన్వీకపూర్‌ ?  

బాలీవుడ్‌   నటి జాన్వీకపూర్‌ తెలుగులో ఎంట్రీ ఇవ్వనుందని తెలిసింది. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయికగా జాన్వీకపూర్‌ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. భారీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ద్వారా దక్షిణాది అరంగేట్రం ఖారారు  చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న జాన్వీకపూర్‌ ఈ సినిమాపై ఆసక్తిగా ఉందని సమాచారం. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే చిత్ర నిర్మాత సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే అంటున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events