Namaste NRI

దేవ‌ర సెట్స్‌లోకి మళ్లీ జాయిన్ అయిన జాన్వీ

జూనియర్‌ ఎన్టీఆర్,  బాలీవుడ్ భామ జాన్వీకపూర్‌ కాంబినేషన్‌లో వస్తున్న ప్రాజెక్ట్‌ దేవర. కొరటాల శివ దర్శకత్వం. షూటింగ్‌ దశలో ఉన్న ఈ మూవీకి సంబంధించి ఇటీవలే ఓ పాటను షూట్‌ చేసినట్టు అప్‌డేట్‌ వచ్చింది. ఫిషింగ్‌ హార్బర్‌ విలేజ్‌, పోర్ట్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతుది.జాన్వీకపూర్‌ ప్రస్తుతం గోవా షెడ్యూల్‌లో జాయిన్ అయింది. కొన్ని రోజుల పాటు జరుగనున్న ఈ చిత్రీకరణలో తారక్‌, జాన్వీకపూర్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారట. ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్‌ సైఫ్‌ అలీఖాన్‌ భైర పాత్రలో నటిస్తుండగా,  ప్రకాశ్ రాజ్‌, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్‌, మురళీ శర్మ ఇతర కీ రోల్స్‌ పోషిస్తున్నారు. మ‌ల్టీ లింగ్యువల్‌ సినిమాగా వస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నా డు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్‌ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న మూవీ రెండు పార్టులుగా విడుదల కానుంది. దేవర పార్టు 1 అక్టోబర్‌ 10న గ్రాండ్‌గా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress