Namaste NRI

కొత్త రికార్డు క్రియేట్ చేసిన జ‌పాన్   

జ‌పాన్  కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఆ దేశంలో వంద ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య ల‌క్ష దాటిన‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. వ‌రుస‌గా 55వ సంవ‌త్స‌రం ఆ దేశం కొత్త రికార్డును న‌మోదు చేసింది. సెప్టెంబ‌ర్‌లో శ‌తాధిక వృద్ధుల సంఖ్య 99,763 మందికి చేరుకున్న‌ట్లు ఆరోగ్య‌శాఖ మంత్రి  వెల్ల‌డించారు. అయితే దీంట్లో 88 శాతం మంది మ‌హిళ‌లే ఉండ‌డం గ‌మ‌నార్హం.అత్య‌ధిక కాలం జీవిస్తున్న వారి సంఖ్య జ‌పాన్‌లో అధికం. ఆ లిస్టులో జపాన్ టాప్‌లో ఉంటుంది. ప్ర‌పంచంలోని అత్యంత వృద్ధ వ్య‌క్తి ఆ దేశంలో జీవిస్తున్న‌ట్లు రికార్డులు ఉన్నాయి. చాలా ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోవ‌డం వ‌ల్ల జ‌పాన్ ప్ర‌జ‌లు ఎక్కువ కాలం జీవిస్తున్నారు. కానీ అక్క‌డ జ‌న‌న రేటు త‌క్కువ‌గా ఉన్న‌ది.

ఆదేశంలో జీవిస్తున్న అత్యంత వృద్ధ వ్య‌క్తి వ‌య‌సు 114 ఏళ్లు. య‌మ‌టోక‌రియామాకు చెందిన ఆ మ‌హిళను షిగికో క‌గ్వాగా గుర్తించారు. నారా సిటీకి శివారు ప్రాంతంలో ఇది ఉన్న‌ది. జ‌పాన్ లెక్క‌ల ప్ర‌కారం అత్యంత వృద్ధ మ‌గ వ్య‌క్తిని కియోట‌కా మిజునోగా గుర్తించారు. ఆయ‌న వ‌య‌సు 111 ఏళ్లు. ఇవాటా అత‌ని స్వ‌స్థ‌లం.ఆరోగ్య‌శాఖ మంత్రి త‌క‌మారో పుఖోకా ఈ నేప‌థ్యంలో వృద్ధుల‌కు కంగ్రాట్స్ చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events