
ప్రధాని మోదీ పర్యటన వేళ సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికాకు జపాన్ షాకిచ్చింది. పెట్టుబడులపై చర్చించేందుకు అగ్రరాజ్యంలో పర్యటించాల్సిన జపాన్ వాణిజ్య మంత్రి చివరి నిమిషంలో తన పర్యటనను రద్దు చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జపాన్‌పై 25 శాతం సుంకాలు విధించారు. దీంతో ఆ దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు టోక్యో నిర్ణయించింది. ఇందులో భాగంగా 550 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి ఇరు దేశాలు ఇప్పటికే చర్చలు ప్రారంభించాయి. దీంతో సుంకాలను 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది.















