దక్షిణాఫ్రికాలో కరోనా వేరియంట్ ఒమైక్రాన్ ప్రపంచ దేశాల్లో గుబులు పుట్టిస్తోంది. ఇంతకు ముందు వేరియంట్లతో పోల్చితే ఒమైక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. దీంతో కరోనా ఆంక్షలను మళ్లీ అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ ప్రయాణికులపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నేటి నుంచి ఈ నిబందనలు అమలులోకి వస్తాయని ఆ దేశ ప్రధాని పుమియో కిషిదా తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.