సుమ కనకాల ప్రధానపాత్రలో నటించిన చిత్రం జయమ్మ పంచాయితీ. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించగా విజయ్ కుమార్ కలివరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే 6న ఈ సినిమా విడుదల కాబోతుంది. తాజాగా హైదరాబాద్ దస్‌పల్లాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అక్కినేని నాగార్జున మాట్లాడుతూ సుమ మీదున్న అభిమానంతో నేనీ వేడుకకు వచ్చాను. ఇక్కడ పండగలాంటి వాతావరణం కనిపిస్తున్నది. తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది అని అన్నారు. అనంతరం నానా మాట్లాడుతూ సుమ మనందరి ఇంటి మనిషిగా మారారు. ట్రైలర్ చూశాక తను వెండితెరపై కూడా సక్సెస్ అవుతుందనిపించింది అని అన్నారు. సుమ మాట్లాడుతూ తెలుగువారందరూ తమ ఇంటి అమ్మాయిగా భావించడం వల్లే నేనీ స్థాయికి వచ్చాను. మీ చప్పట్టే నాకు బలాన్నిస్తున్నాయి. ఈ సినిమా ప్రమోషన్‌కు రామ్‌చరణ్, నాని, నాగార్జున, రాజమౌళి త్రివిక్రమ్, పవన్‌కల్యాణ్ వంటి స్టార్స్ సహకరించారు. అందరి హీరోల అభిమానులు ఈ సినిమాను చూస్తారని భావిస్తున్నానని తెలిపారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ సినిమాలో సుమ అద్బుతమైన నటనను కనబరచిందని, కీరవాణి సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుందని తెలిపారు. అందం, తెలివితేటలతో పాటు మంచి మనసున్న సుమ నటించిన ఈ సినిమా విజయవంతం కావాలని దర్శకుడు కీరవాని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చంద్రబోస్, సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్, రాజీవ్ కనకాల, గాయకుడు శ్రీకృష్ణ, కెమెరామెన్ అనూప్, దినేష్‌కుమార్, షాలినీ తదితరులు పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)