Namaste NRI

 వచ్చే నెలలోనే జయమ్మ పంచాయతీ

ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జయమ్మ పంచాయతీ. విజయ్‌ కుమార్‌ కలివారపు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బలగ ప్రకాష్‌ నిర్మాత. ఈ చిత్రానికి ఏప్రిల్‌ 22న విడుదల చేయబోతున్నారు. ఇందులో సుమ ఊరి పెద్ద జయమ్మ పాత్రలో కనిపిస్తుంది. పల్లెటూరి డ్రామాగా రూపొందిన చిత్రమిది. ఎవరికీ, దేనికీ లొగని పల్లెటూరి మహిళగా సుమ నటించారు. ఆమె పంచాయితీ నిర్వహించి తీర్పు చెప్పిందంటే ఇక తిరుగుండదు. రామ్‌చరణ్‌ రిలీజ్‌ చేసిన మా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కి, నాని రిలీజ్‌ చేసిన తొలి పాటకి, రానా దగ్గుబాటి విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. అలాగే దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ఆవిష్కరించిన టైటిల్‌ సాంగ్‌కి అనూహ్యమూన స్పందన వచ్చింది అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: అనూష్‌ కుమార్‌, సమర్పణ: విజయలక్ష్మి, ఎగ్జిక్యూటివ్‌  ప్రొడ్యూసర్స్‌: అమర్‌`అఖిల.  కూర్పు : రవితేజ గిరిజాల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events