జయతి నటించిన తెలంగాణ జానపద గీతం నా ఫ్రెండ్‌దేమో పెళ్లి. ఈ పాటను నివృతి వైబ్స్ రూపొందించింది. ఈ పాటను భీమ్స్ సిసిరోలియో స్వరకల్పనలో కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా శ్రావణ భార్గవి పాడారు. నా ఫ్రెండ్‌దేమో పెళ్లి పాటను తాజాగా నటుడు జేడీ చక్రవర్తి విడుదల చేశారు. ఈ సందర్భంగా నటి జయతి మాట్లాడుతూ వీజేగా కార్యక్రమాలు చేశాను. రెండేండ్ల విరామం తర్వాత సినిమా నిర్మించి నాయికగా నటించాను. ఇప్పుడు ఈ పాటతో మీ ముందుకు వస్తున్నా అన్నారు. నివృతి వైబ్స్ నుంచి ప్రియా మాట్లాడుతూ మా సంస్థలో ఇప్పటికే విడుదల చేసిన జరీ జరీ పంచెకట్టు, గంగులు, సిలక ముక్కుదానా, జంజీరే వంటి పాటలకు మంచి ఆదరణ దక్కుతున్నది. వాటిలాగే నా ఫ్రెండ్‌దేమో పెళ్లి పాటకూ శ్రోతల మెప్పు దక్కుతుందని ఆశిస్తున్నాం అన్నారు.


శేఖర్ మాస్టర్, సుద్దాల అశోక్ తేజ, భీమ్స్ సిసిరోలియో, షణ్ముఖ్ జశ్వంత్, మధు ప్రియ, శ్రావణ భార్గవి, దేత్తడి హారిక, లహరి షారి, మానస్, విష్ణు ప్రియ, అనన్య భట్, రాజ్యలక్ష్మి, హారిక నారాయణ్, సాకేత్ కొమందూరి వంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌తో నివృతి వైబ్స్ వర్క్ చేసింది. 2024 పూర్తయ్యేసరికి 150 పైచిలుకు మ్యూజిక్ వీడియో సాంగ్స్‌ను అందించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు నివృతి వైబ్స్ సంస్థ తెలియజేశారు.

