Namaste NRI

జెఫ్‌ బెజోస్‌ కీలక నిర్ణయం.. అమ్మకానికి అమెజాన్‌ షేర్లు

 అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వచ్చే ఏడాదిలో కంపెనీకి చెందిన 50 మిలియన్ల (5 కోట్ల) షేర్లను విక్రయించాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో షేరుకు 171.8 డాలర్లుగా ఉన్నది. అమెజాన్‌ షేర్ల మొత్తం విలువ 8.6 బిలియన్ డాలర్లు. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం షేర్ల విక్రయానికి సంబంధించిన ప్రణాళిక గతే డాది 8న మొదలైంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఊహించిన దానికంటే మెరుగైన అమ్మకాలు నమోద వగా, అమెజాన్ షేర్లు దాదాపు 8శాతం పెరిగాయి. గత ఏడాది అమెజాన్ షేర్లు 80 శాతానికిపైగా పెరిగి బెంచ్‌ మార్క్‌ ఇండెక్స్‌ ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌ను అధిగమించాయి. బెజోస్ 1994లో అమెజాన్‌ను స్థాపించా రు.  బెజోస్ ప్రస్తుతం 185 బిలియన్ల నికర సంపదతో ప్రపంచంలోని మూడో అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు.

Social Share Spread Message

Latest News