రష్యాతో యుద్ధంలో ఉన్న ఉక్రెయిన్‌కు ఆయుధాలను అమెరికా సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా క్లస్టర్ బాంబులను కూడా ఉక్రెయిన్‌కు పంపాలని అమెరికా నిర్ణయించుకున్నది. ఆ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమర్ధించుకున్నారు. సాధారణంగా యుద్ధాల్లో క్లస్టర్ బాంబుల వల్లే అధిక ప్రాణ నష్టం జరిగినట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది.ఉక్రెయిన్ అమ్ములపొదిలో ఆయుధాలు తగ్గిపోతున్నాయని, అందుకే క్లస్టర్ బాంబులు పంపాలని నిర్ణయించుకున్నట్లు బైడెన్ చెప్పారు.

నాటో దేశాలతో చర్చలు జరిపిన తర్వాతే ఉక్రెయిన్‌కు క్లస్టర్ బాంబులు పంపాలన్న నిర్ణయం తీసుకున్నట్లు బైడెన్ వెల్లడించారు. అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు స్వాగతించారు. మానవ హక్కుల సంఘాలు, కొందరు డెమోక్రాట్లు మాత్రం ఆ నిర్ణయాన్ని తప్పుపట్టారు.

