అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బూస్టర్ డోసు తీసుకున్నారు. వైట్‌హౌస్‌లో ఆయన ఫైజర్ టీకా మూడో డోసు తీసుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందే బైడెన్ మొదటి డోసులు తీసుకున్న విషయం తెలిసిందే. తొలి రెండు డోసులు తీసుకున్న తర్వాత ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ లేకపోవడంతో మూడో డోసు తీసుకున్నట్లు శ్వేతసౌధం అధికారులు వెల్లడిరచారు. 65 ఏళ్లకు పైబడిన వారు ఈ బూస్టర్ డోసు తీసుకోవచ్చు. కనుక అర్హత ఉన్నవారు మూడో డోసు తీసుకోవడం చాలా ముఖ్యమని బైడెన్ పేర్కొన్నారు. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారం రోజుల కింద ఫైజర్ అభివృద్ధి చేసిన బూస్టర్ డోసును అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)