రష్యాకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. జర్మనీ నూతన చాన్స్‌లర్‌తో బైడెన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ ఉక్రెయిన్‌ను రష్యా ఆక్రమిస్తే రష్యా, జర్మనీ మధ్య గ్యాస్ సరఫరాకు ఉద్దేశించిన నార్డ్ స్ట్రీమ్ 2 పైప్‌లైన్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఉక్రెయిన్ విషయంలో రష్యా మరొక్క అడుగు ముందుకేసినా నార్డ్ స్ట్రీమ్ 2 ఉండదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. నాటో కూటమి ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉందని అన్నారు. ఈ పైప్‌లైన్ అడ్డుకుంటే రష్యా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. కానీ అదే సమయంలో జర్మనీకి కూడా ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే ఈ పైప్‌లైన్ నిర్మాణం పూర్తయింది. కానీ ఇంకా కార్యకలాపాలు మొదలుపెట్టలేదు.














