గతేడాది నవంబర్‌లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ట్రంప్ విజయంతో మరో పది రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవి నుంచి జో బైడెన్ దిగిపోనున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు.అధ్యక్ష ఎన్నికల పోటీల్లో తాను నిలబడి ఉంటే ట్రంప్‌ను ఓడించేవాడినని వ్యాఖ్యానించారు. తాను మొన్నటి ఎన్నికల బరిలో దిగి ఉంటే ట్రంప్‌ను కచ్చితంగా ఓండిచేవాడినని విశ్వాసం వ్యక్తం చేశారు. డెమోక్రటిక్ పార్టీలో ఐక్యత కోసమే తాను అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నట్లు బైడెన్ స్పష్టం చేశారు. ట్రంప్‌ను కమలా హారిస్ ఓడించగలదని తాను భావించినట్లు చెప్పారు. అందుకే అధ్యక్ష ఎన్నికల్లో ఆమెకు మద్దతిచ్చినట్లు బైడెన్ చెప్పుకొచ్చారు. అందుకు కమలా సైతం తీవ్రంగా కృషి చేసినట్లు బైడెన్ వివరించారు.