Namaste NRI

నాటోలో చేరిక ఎవరికీ ముప్పు కాదు: బైడెన్‌

శక్తిమంతమైన నాటోలో చేరాలని దరఖాస్తు చేసిన రెండు దేశాలను అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ స్వాగతించారు. స్వీడన్‌ ప్రధాని మగ్దలీనా ఆండర్స్‌న్‌, ఫిన్లాండ్‌ అధ్యక్షుడు సౌలీనీనిస్తోలతో శ్వేతసౌధంలో కరచాలనం చేసి, అభినందనలు తెలిపారు. కూటిమిలో కొత్త దేశాలు చేరడం ఏ దేశానికి ముప్పు మాత్రం కాదన్నారు. వీటి చేరికకు ఆమోదం తెలపాల్సిందిగా సెనేట్‌ను కోరినట్లు తెలిపారు. స్వీడన్‌, ఫిన్లాండ్‌లను నాటోలో చేర్చుకోవద్దని టర్కీ మరోసారి అభ్యంతరం లేవనెత్తింది. తమ భద్రతకు ముప్పుగా భావిస్తున్న ఖుర్దు తీవ్రవాదులకు ఆ రెండు దేశాలూ ఆశ్రయం కల్పిస్తున్నాయని టర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.  తమ అభ్యంతరాలకు సమాధానం లభించే వరకు సభ్యత్వాల విషయంలో ముందడుగు పడదని ఎర్దోగన్‌ అధికార ప్రతినిధి చెప్పేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events