Namaste NRI

జూనియర్ ఎన్టీఆర్‌కు గాయాలు.. షూటింగ్ చేస్తుండగా ప్రమాదం

అగ్ర నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ గాయపడ్డారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఓ యాడ్‌ షూట్‌లో ఆయన కాలికి స్వల్పంగా గాయమైంది. యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో అనుకోకుండా కిందపడటంతో ఆయనకు గాయమైంది. తక్షణమే వ్యక్తిగత సిబ్బంది ఆయన్ను దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితిని అధ్యయనం చేసిన వైద్యులు రెండువారాలు విశ్రాంతి అవసరమని సూచించారు. ఈ మేరకు ఎన్టీఆర్‌ టీమ్‌ ఈ ప్రమాదంపై ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. ఎన్టీఆర్‌ ఆరోగ్యంపై వస్తున్న అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మొద్దు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events