Namaste NRI

కే3 కోటికొక్కడు వచ్చేస్తున్నాడు

కిచ్చా సుదీప్‌ హీరోగా మడోన్నా సెబ్బాస్టియన్‌, శ్రద్దాదాస్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం కే3  కోటికొక్కడు. శివ కార్తీక్‌ దర్శకత్వం వహించారు. గుడ్‌ సినిమా గ్రూప్‌ బ్యానర్‌పై శ్రేయాస్‌ శ్రీనివాస్‌, దేవేంద్ర డీకే కే3 కోటికొక్కడు చిత్రాన్ని జూన్‌ 17న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మాస్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. కన్నడలో దాదాపు 60 కోట్లపైన వసూళ్లు సాధించి, సుదీప్‌ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇప్పటికే విడుదలైన తెలుగు ట్రైలర్‌తో సినిమాపై మంచి అంచనాలున్నాయి అన్నారు నిర్మాతలు. త్వరలో మూడు పాటల్ని విడుదల చేయబోతున్నాం. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. సుదీప్‌ పాత్ర కొత్త పంథాలో సాగుతుంది. యాక్షన్‌ ఘట్టాలు రొమాంచితంగా ఉంటాయి అని చిత్రబృందం పేర్కొంది. రవి శంకర్‌ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సమర్పణ: స్పందన పాసం, శ్వేతన్‌ రెడ్డి, సంగీతం: అర్జున్‌ జెన్యా, కెమెరా: శేఖర్‌ చంద్రు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events