శ్రీకాళహస్తి స్థల పురాణం ఆధారంగా మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న భక్తిరస ప్రధాన చిత్రం కన్నప్ప. విష్ణు సరసన ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తుంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. ఇప్పటికే మూవీ నుంచి మోహన్ బాబు, మంచు విష్ణులతో పాటు మోహన్ లాల్, శరత్ కుమార్ తదితర ప్రముఖుల ఫస్ట్ లుక్‌లను పంచుకున్న చిత్రబృందం తాజాగా స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ముల్లోకాలు ఏలే తల్లి..భక్తుల్ని ఆదుకునే త్రిశక్తి..శ్రీకాళహస్తిలో వెలసిన శ్రీజ్ఞాన ప్రసూనాంబిక అంటూ పార్వతీదేవి వైశిష్ట్యాన్ని తెలియజెపుతూ ఫస్ట్‌లుక్‌ను ఆవిష్కరించారు.
పార్వతీదేవి పాత్రలో ప్రసన్నవదనంతో దైవత్వం మూర్తీభవించినట్లుగా కనిపిస్తున్న ఈ పోస్టర్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ఈ సినిమాలో పరమశివుడి పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తుండగా, పార్వతి పాత్రలో కాజల్ నటిస్తు న్నట్లు వెల్లడించింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న కన్నప్ప చిత్రంలో మోహన్‌లాల్, మోహన్‌బాబు, ప్రభాస్, బ్రహ్మానందం, అక్షయ్ కుమార్, శరత్‌కుమార్ వంటి అగ్ర తారలు భాగమవుతున్నారు. భారీ వ్యయంతో మోహన్‌బాబు మంచు రూపొందిస్తున్నారు. ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకురానుంది.