అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున అభ్యర్థిత్వం ఆశిస్తున్న భారత సంతతికి చెందిన కమలా హారిస్‌కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు మద్దతు ప్రకటించారు. అమెరికాకు ఆమె అద్భుతమైన అధ్యక్షురాలు అవుతారని ఒబామా ప్రశంసించారు. ఈ మేరకు ఒబామా, ఆయన సతీమణి మిషెల్..హారిస్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఒక వీడియో విడుదల చేశారు. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించడానికి చేయగలిగినంత సహాయాన్ని చేస్తామని, ఈ పదవికి ఆమె అర్హురాలని తెలిపా రు. తొలుత హారిస్‌కు ఒబామా మద్దతు ప్రకటించక పోవడంతో ఆయన ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ప్రచారం జరిగింది. తాజాగా ఒబామా ఆమెకు మద్దతు ప్రకటించారు.