తమిళ అగ్రహీరో సూర్య నటిస్తున్న చిత్రం కంగువ. స్టూడియోగ్రీన్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై కేఈ జ్ఞానవేల్‌రాజా, వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దిశాపటానీ. బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో సూర్య పోరాట యోధునిగా కనిపించనున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్‌లో పులితో సూర్య చేసిన విన్యాసాలు, గుర్రపు స్వారీలూ, భయంకరమైన భారీ యుద్ధ సన్నివేశాలు హాలీవుడ్ ఎపిక్ వార్ మూవీస్‌ని గుర్తుచేస్తున్నాయని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకోసం హీరో సూర్య పడిన శ్రమ, పాత్రకోసం ఆయన మారిన తీరు, కంగువ పాత్రలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి శివ దర్శకుడు. పది భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం త్రీడీలో కూడారానుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: వెట్రి పళనిస్వామి, సంగీతం: దేవిశ్రీప్రసాద్.