ప్రముఖ కన్నడ హీరో, పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (46) తుదిశ్వాస విడిచారు. ఇంట్లో జిమ్ చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలి పడిపోయిన ఆయన్ని కుటుంబ సభ్యులు హుటాహుటినా విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు ఆయన్ను బతికించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా పునీత్ ప్రాణాలు దక్కలేదు. పునీత్ మరణంతో కన్నడ సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు తీవ్రలోటు అని సినీ ప్రముఖులు వెల్లడిరచారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. పునీత్ మరణవార్త విని అభిమానులు కన్నీటి పర్వంతమవుతున్నారు. సినీ నటులు, రాజకీయ ప్రముఖులు పునీత్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)