మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. శ్రీ కాళహస్తి స్థలపురాణం నేపథ్యం లో భక్తిరస ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తు న్నారు. ఈ సినిమాలో మోహన్‌లాల్, మోహన్‌బాబు, ప్రభాస్ వంటి అగ్ర నటులు భాగం అవుతున్నారు. ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ను ఇటీవలే న్యూజిలాండ్‌లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తాలూకు తాజా అప్‌డేట్ వెలువడింది. ఈ చిత్రానికి ప్రభు దేవా నృత్యరీతుల్ని సమకూర్చబోతున్నారు. ఈ మేరకు చిత్ర బృందం న్యూజిలాండ్‌లో ఆయనకు స్వాగతం పలికింది. ప్రభుదేవా రాకతో కన్నప్ప చిత్రం మరో స్థాయికి వెళ్లిందని, ఆయన కొరియోగ్రఫీ సినిమాకు ప్రధానా కర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం పేర్కొంది.
