Namaste NRI

చరిత్ర సృష్టించిన నల్లజాతి మహిళ.. కరీనా బాస్‌

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఒక నల్లజాతి మహిళ చరిత్ర సృష్టించింది.  లాస్‌ ఏంజెలిస్‌ మేయర్‌ పదవిని మొట్టమొదటిసారిగా ఒక నల్లజాతి మహిళ కైవసం చేసుకుంది. లాస్‌ ఏంజెలిస్‌కు ఒక మహిళ మేయర్‌ కావడం ఇదే తొలిసారి. లాస్‌ ఏంజెలిస్‌ లో 40 లక్షల జనాభా ఉన్న రిపబ్లికన్‌ అభ్యర్థి, కుబేరుడు రిక్‌ కరుసోపై డెమొక్రటిక్‌ మహిళా అభ్యర్థి కరీన్‌ బాస్‌ దాదాపు 47,00 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 70 శాతానికిపైగా ఓట్ల లెక్కింపు పూర్తవడంతో కరీన్‌ బాస్‌ గెలుపు దాదాపు ఖరారైనట్లే.  లాస్‌ ఏంజెలిస్‌ మేయర్‌ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా రిక్‌ కరుసో ఏకంగా రూ.817 కోట్లకు పైగా ఖర్చుపెట్టినట్లు తెలిసింది. ఈ ఎన్నికలు మనీకి సంబంధించినవి కాదు. మనుషులకు సంబంధించినవి అని ప్రచార సందర్భంగా కరీన్‌ బాస్‌ వ్యాఖ్యానించడం ప్రస్తావనార్హం.  రెండేళ్ల క్రితం అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చెందిన ఉపాధ్యక్ష అభ్యర్థుల షార్ట్‌ లిస్ట్‌లోనూ కరీన్‌ పేరు ఉండటం గమనార్హం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events