నిఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా కార్తికేయ 2. అనుపమా పరమేశ్వన్ నాయికగా నటిస్తున్నది. కార్తికేయ (2014)కి సీక్వెల్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. సముద్రం దాచుకున్న అతిపెద్ద రహస్యం ఈ ద్వారకా నగరం అంటూ మొదలైన మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా సాగింది. ద్వారకా నగర రహస్యాన్ని తెలుసుకునేందుకు డాక్టర్ కార్తికేయ అనే యువకుడు, తన ప్రేయసి, ముగ్ధ, మిత్రులతో చేసిన ప్రయాణం ఎలా సాగింది అనేది సినిమాలో చూపించబోతున్నారు. ఈ చిత్రంలో హిందీ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర చేస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలై 22న విడుదల కానుంది. శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, ఆదిత్యా మీనన్, తులసి, సత్య, వైవా హర్ష తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కో`ప్రొడ్యూసర్: వివేక్ కూచిభొట్ల, సంగీతం: కాలభైరవ, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని.














