నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం కార్తికేయ 2. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ చాలా వరకు పూర్తయింది. హిమాచల్‌ప్రదేశ్‌లో షూటింగ్ చేశారు. తాజాగా స్పెయిన్, గ్రీస్ దేశాల్లో చిత్రీకరణ జరుగుతోందని చిత్ర బృందం తెలిపింది. హిమాచల్ ప్రదేశ్‌లో కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కించాం. ప్రస్తుతం యూరప్‌లో అందమైన ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది. ఏప్రిల్ తొలి వారంలో ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని వెల్డ్లడిస్తామని సినీ వర్గాలు తెలిపాయి. ఇందులో అనుపమ ముగ్ధ అనే యువతిగా కనిపించనుంది. నాయికగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రానికి టిజి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మిస్తున్నాయి. చందు మొండేటి దర్శకుడు.














