Namaste NRI

అనిల్‌ రావిపూడి చేతుల మీదుగా కరుణ్‌ అర్జున్‌ ట్రైలర్‌ విడుదల

అభిమన్యు, నిఖిల్‌ కుమార్‌, పిఫా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం కరణ్‌ అర్జున్‌. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ట్రైలర్‌ చాలా బాగుందన్నారు. విజువల్స్‌ ఆకట్టుకున్నాయన్నారు. యంగ్‌ టీం ఎంతో రిస్క్‌చేసి పాకిస్థాన్‌ బోర్డర్‌లో షూటింగ్‌ చేశారని అన్నారు. ట్రైలర్‌లాగానే సినిమా కూడా ఆకట్టుకుంటుందన్నారు. టీంకు ఆల్‌దిబెస్ట్‌ అని తెలిపారు.  నిర్మాతల్లో ఒకరైన బాలకృష్ణ మాట్లాడుతూ త్వరలో సినిమాను విడుదల చేయనున్నామని తెలిపారు. దర్శకుడు మోహన్‌ శ్రీవత్స మాట్లాడుతూ మూడు పాత్రలతో రోడ్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలిపారు.  ప్రతి సన్నివేశం ఎవరూ ఊహించని విధంగా ఉంటుందన్నారు. థియేటర్స్‌లో ఆడియోన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తుందన్నారు. కంటెంట్‌ను నమ్ముకుని సినిమాను చేశామన్నారు.  ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ రవి మేకల తదితరులు ప్రసంగించారు. ఈ చిత్రానికి మోహన్‌ శ్రీవత్స దర్శకత్వం వహించారు. డాక్టర్‌ సోమేశ్‌కుమార్‌ పొన్నాన, బాలకృష్ణ ఆకుల, సురేష్‌, రామకృష్ణ క్రాంతి, కిరణ్‌, నిర్మాతలు. రవి మేకల ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events