తెలంగాణ రాష్ట్రంలో కరోనా సమయంలో పేద ప్రజల కోసం చేసిన సేవలకు గుర్తింపుగా టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డికి అభిష్టి సేవా పురస్కారం అవార్డు దక్కింది. అభిస్తి సంస్థ తమ ఏడో వార్షికోత్సవం సందర్భంగా ఈ అవార్డును ప్రధానం చేశారు. ఈ సందర్భంగా నాగేందర్ మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా సభ్యులు, విదేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు సాయం చేసేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటారన్నారు. సమయానికి పేద ప్రజలకు భోజనాన్ని అందించిన బాగీస్ ఫుడ్ సర్వీసెస్, టీ కేఫ్‌ల అధినేత కోటేశ్వర బాగీకి, తమను గుర్తించి ప్రోత్సహించిన అభిస్టి వెల్ఫేర్ సొసైటీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)