జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని మెల్‌బోర్న్‌లో ని అల్కాక్ రిజర్వ్‌లోని పెవిలియన్‌లో కేసీఆర్ కప్ టోర్నమెంట్ గ్రాండ్ ఫైనల్స్ మ్యాచ్‌ను అత్యధిక జనసందోహంతో గ్రాండ్‌గా నిర్వహించారు. భారత దేశానికి చెందిన 29 రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలతో 3 వారాల పాటు ఈ టోర్నమెంట్ నిర్వహించినట్లు బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు. భారత్‌కు చెందిన అన్ని రాష్ట్రాల ఎన్నారైలు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు ఇందులో పాల్గొన్నారు. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ మార్పు గల ముఖ్య ఉద్దేశాన్ని అందరికీ తెలిజేయాలని, అందుకే క్రికెట్ సరైన వేదికగా భావించి ఈ టోర్నమెంట్ నిర్వహించామని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమంపై విక్టోరియా స్టేట్ కన్వీనర్ సాయిరాం ఉప్పు చేసిన పవర్ ప్రెజెంటేషన్ పలువురిని ఆకట్టుకుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ది, సంక్షేమ విజయాలపై కేసీఆర్ విజన్‌ను పలువురు ఇతర రాష్ట్ర ప్రజలు ప్రశంసలతో ముంచెత్తారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందాన్ని పలువురు ప్రశంసించారు. ఈ వేడుకలలో సాయి రామ్ ఉప్పు, అశోక్, రాకేష్, అమిత్, వినోద్ కత్తుల, విజయ్ నడదూర్, సతీష్, శివ హైదరాబాద్, హరి పల్ల, కరుణాకర్ నందవరం, వినయ్ సన్నీ గౌడ్, సాయికృష్ణ కల్వకుంట్ల, ప్రవీణ్ లేదెళ్ల, వంగపల్లి సురేందర్ రెడ్డి, విశ్వామిత్ర మంత్రి ప్రగడ, సూర్య రావు పాల్గొన్నారు.