సౌత్ ఆఫ్రికా లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్ శాఖ సౌత్ ఆఫ్రికా శాఖ ఆధ్వర్యంలో జోహన్స్‌బర్గ్, కేప్‌టౌన్, డర్బన్ రాష్ట్రాల్లో నిర్వహించారు. కేప్‌టౌన్ లో మసిజిసి నే చిల్డ్రన్స్ హోంలో బీఆర్‌ఎస్ నాయకులు వీరన్న గాండ్ల, చేతన్ కోరబోయిన, డర్బన్‌లో సెయింట్ థామస్ హోమ్ ఫర్ చిల్డ్రన్స్‌లో షేక్‌బాబా ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను అందజేశారు. జొహాన్నెస్బర్గ్ లో నరేందర్ మేడసాని,హరీష్ రంగ, కిరణ్ కుమార్ బెల్లి, అరవింద్ చికోటి, సుఖేష్ అలుగురి , రాంబాబు తోడుపు నూరి, జ్యోతి వాసిరెడ్డి, శిరీష కట్ట , వెంకట్ రావు తాళ్లపల్లి, రంజిత్ కుమార్ పాల్గొన్నారు. జోహన్స్‌బర్గ్‌లో న్యూ లైఫ్ సెంటర్ ఫర్ గర్ల్స్ గృహములో సరుకులను పంపిణీ చేసి, చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేశారు. బీఆర్‌ఎస్ సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షులు నాగరాజు గుర్రాల, కోర్ కమిటీ సభ్యులు, కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు.
