నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందోతున్న చిత్రం దసరా. కీర్తి సురేష్ కథానాయిక. గోదావరిఖని లోని బొగ్గు గనులకు దగ్గరగా ఉండే ఓ గ్రామ నేపథ్యంలో జరిగే కథ ఇది. నాని మాస్ యాక్షన్ పాత్రలో కనిపించనున్నారు. కీర్తి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో తను వెన్నెల అనే పల్లెటూరి యువతిగా డీగ్లా మర్ లుక్‌లో కనువిందు చేయనుంది. ప్రచార చిత్రంలో ఆమె పెళ్లి కూతురిగా పసుపు చీర కట్టుకొని డప్పుల దరువుకు హుషారుగా స్టెప్పేస్తూ కనిపించింది. కీర్తి పాత్రకు ఎంతో ప్రాధాన్యముంది. చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది అని చిత్ర వర్గాలు తెలిపాయి. సముద్ర ఖని, సాయికుమార్, జరీనా వహాబ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది మార్చి 30న విడుదల కానుంది. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ స్వరాలందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహాకుడిగా వ్యవహరిస్తున్నారు.