Namaste NRI

రఘు తాతతో వస్తోన్న కీర్తి సురేష్.. ఎప్పుడంటే?

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రం రఘు తాతా. ఈ సినిమాకు సుమన్‌కుమార్‌ దర్శకత్వం. ఈ మూవీ నుంచి రీసెంట్‌గా టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా,  ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. తాజాగా మూవీ విడుద‌ల తేదీని అనౌన్స్ చేశారు మేక‌ర్స్. ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవం కానుక‌గా ఆగ‌ష్టు 15న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ర‌ఘు తాతా టీజ‌ర్ చూస్తే,  నేషనల్ క్యాడెట్ కార్ప్స్  లో క్యాడెట్ శిక్షణ పొందుతున్న కీర్తి సురేష్ పాత్రతో టీజ‌ర్ ప్రారంభమవుతుంది. అయితే  ఎన్ సిసి మాస్ట‌ర్ హిందీలో శిక్ష‌ణ ఇస్తుండ‌గా, నాకు హిందీ రాదు త‌మిళంలో చెప్పండి సార్ అంటూ కీర్తి సురేష్ చెబుతుంది. దీంతో ఈ చిత్రం తమిళ ప్రజలపై హిందీని రుద్దడం చుట్టూ తిరుగుతున్న‌ట్లు తెలుస్తుంది. ఒక సన్నివేశంలో హిందీ పరీక్ష రాస్తేనే ఉద్యోగంలో ప్రమోషన్ వ‌స్తుంది అంటే దానిని కీర్తి సురేష్ తిరస్కరించడం చూడ‌వచ్చు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా,  ఎంఎస్ భాస్కర్, రవీంద్ర విజయ్, దేవదర్శిని, రాజీవ్ తదితరులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. షాన్ రోల్డన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events