కొవాగ్జిన్ టీకా తీసుకున్న భారతీయులకు ఓ గుడ్ న్యూస్. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా టీకా కొవాగ్జిన్‌కు జర్మనీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారత్‌లోని జర్మనీ రాయబారి వాల్టర్ జే లిండ్నర్ వెల్లడిరచారు. జూన్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. తద్వారా కొవాగ్జిన్ టీకా తీసుకున్న భారతీయులు ఎటువంటి అడ్డంకులు లేకుండా జర్ననీ వెళ్లవచ్చు. కాగా ఈ నిర్ణయం పట్ల జర్మనీ రాయబారి వాల్టర్ జే లిండ్నర్ హర్షం వ్యక్తం చేశారు. కొవిడ్ టీకాల గుర్తింపులేమి కారణంగా వీసా జారీలో ఆలస్యం జరుగుతోందని పేర్కొన్నారు. కొవాగ్జిన్‌ను గుర్తించాలంటూ తమ ప్రభుత్వాన్ని ఎంతోకాలంగా కోరుతున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు.
భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ గత నవంబర్‌లోనే అనుమతులు జారీ చేసింది. దీంతో ఆస్ట్రేలియా, జపాన్, కెనడా వంటి దేశాలు కొవాగ్జిన్ టీకా తీసుకున్న ప్రయాణికులను అమతిస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా జర్మనీ కూడా కొవాగ్జిన్ తీసుకున్న వారిని తమ దేశంలోకి అనుమతించనున్నట్లు ప్రకటించింది.