Namaste NRI

ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణం కేసులో కీలక పరిణామం

అమెరికాలో ఫైనాన్షియ‌ర్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌ కేసుకు సంబంధించిన ఫైల్స్‌ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఫైల్స్‌ను బహిర్గతం చేసే బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేశారు. ఈ సందర్భంగా డెమోక్రాట్లపై ట్రంప్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. జెఫ్రీతో డెమోక్రాట్లకు ఉన్న సంబంధం గురించిన నిజాలు త్వరలోనే బయటపడొచ్చని వ్యాఖ్యానించారు. డెమోక్రాట్‌ పార్టీ, ఆ పార్టీ నాయకులకు జెఫ్రీ వేల డాలర్లు విరాళంగా ఇచ్చినట్లు ట్రంప్‌ ఆరోపించారు. ఫైనాన్షియ‌ర్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణం కేసు అమెరికాను కుదిపేసింది. తన పరపతి పెంచుకోవడం కోసం జెఫ్రీ ఏళ్ల తరబడి టీనేజ్‌ అమ్మాయిలను ఎరగా వేశాడు.

2002-2005 మధ్య కాలంలో మైనర్‌ బాలికలను, యువతులకు డబ్బు ఆశ చూపించి తన మాన్‌హట్టన్‌ భవనం, పామ్‌ బీచ్‌ ఎస్టేట్‌, ఫ్లోరిడా, న్యూయార్క్‌, వర్జిన్‌ ఐలాండ్స్‌, మెక్సికోల్లోని నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలతో 2019 జులైలో ఎప్‌స్టీన్‌ను అరెస్ట్‌ చేశారు. ఇక అదే ఏడాది ఆగస్టు 10న మాన్‌హట్టన్ జైలు గదిలో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన సన్నిహితుల జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సహా, మాజీ అధ్యక్షులు, రాజకీయ, వ్యాపార వేత్తలు కూడా ఉన్నట్లు ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events