భారత సంతతికి చెందిన బి.సోపెన్ బి షాను వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ విస్కాన్సిన్‌కి యూఎస్ స్టేట్స్ అటార్నీగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినెట్ చేశారు. జూన్ 6వ తేదీన వైట్‌హౌస్ ప్రకటించిన ఆరుగురు యూఎస్ అటార్నీ జాబితాలో సోపెన్ షా కూడా వున్నారు. ట్రంప్ హయాంలో నియమితుడైన స్కాట్ బ్లేడర్ స్థానంలో సోపెన్ బాధ్యతలు చేపట్టనున్నారు. సోపెన్ నియామకం ఆమోదించబడితే మాడిసన్లోని యూఎస్ అటార్నీ కార్యాలయానికి నాయకత్వం వహించే రెండవ మహిళగా ఘనత దక్కించుకుంటారు. సోపెన్ షా 2017 నుంచి 2019 వరకు విస్కాన్సిన్ డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా హైప్రొఫైల్ సివిల్, క్రిమినల్ అప్పీల్స్‌లో వాదనలు వినిపించారు. కెంటుకీలో స్థిరపడిన సోపెన్ షా 2015లో యేల్ లా స్కూల్ నుంచి జేడీ, 2008లో హార్వర్డ్ కాలేజీ నుంచి ఏబీ మాగ్నా కమ్ లాడ్‌ను అందుకున్నారు. 2019 నుంచి పెర్కిన్స్ కోయి ఎల్ఎల్పీ కౌన్సెల్‌గా వ్యవహరిస్తున్నారు.














