Namaste NRI

గుడ్ న్యూస్ చెప్పిన కియారా అద్వానీ

బాలీవుడ్ క్యూట్ క‌పుల్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మ‌ల్హోత్రా త‌మ అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. త్వ‌ర‌లోనే తాము తల్లిదండ్రులు అవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా కొత్త ఫొటోను పంచుకున్నారు. 2023 ఫిబ్రవరిలో ఆమె ప్రియుడు సిద్ధార్థ్‌ మల్హోత్రాను ఘనంగా వివాహం చేసుకుంది కియారా. జైపూర్‌లోని ఓ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వీళ్ల పెళ్లి జరిగింది. అయితే పెళ్లి అయిన నాలుగు నెల‌ల‌కే కియారా అద్వానీ గ‌ర్భ‌వ‌తి అంటూ బాలీవుడ్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. దీంతో ఆ వార్త‌లు నిజమే అనుకున్నారు కియరా అభిమానులు. అయితే ఆ వార్త‌లు అబ‌ద్ద‌మంటూ త‌ర్వాత క్లారిటీ ఇచ్చింది ఈ భామ‌.

ఇదిలావుంటే తాజాగా నేను త‌ల్లి కాబోతున్నానంటూ ఒక ఫొటోను పంచుకుంది. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మ‌ల్హోత్రా త‌మ రెండు చేతులు ముందుకు చాచి చిన్నారి సాక్స్ ఫొటో పంచుకున్నారు. మా జీవితాల్లోకి గొప్ప బహుమతి త్వరలో వస్తుంది అంటూ ఈ ఫొటోకి క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు, సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events