Namaste NRI

అమెరికా పంపిన ఆహ్వానాన్ని తిరస్కరించిన కిమ్

అమెరికా పంపిన ఆహ్వానాన్ని ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తోసిపుచ్చారు.  అమెరికాతో చర్చలు ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దక్షిణ కొరియాతో ఆగిపోయిన చర్చలను త్వరలోనే పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఉత్తర కొరియాపై చూపిస్తున్న శత్రువ్వ వైఖరిని కప్పిపుచ్చుకోవడానికి అమెరికా అనుసరిస్తున్న మోసపూరిత మార్గంగా దాన్ని అభివర్ణించారు. అమెరికా తన శత్రు విధానాలను విడనాడేవరకూ అణ్వాయుధాలను పెంచుకుంటూనే ఉంటామని, చర్చలకూ దూరంగా ఉంటామని కిమ్‌ హెచ్చరించారు.   పార్లమెంటు ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కిమ్‌ ప్రకటన దక్షిణ కొరియా, అమెరికాల మధ్య దూరాన్ని పెంచేందుకు చేసిన యత్నమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తర కొరియాపై ఆర్థిక, ఇతర రంగాల్లో అమెరికా విధించిన ఆంక్షల నుంచి ఉపశమనం పొందడానికి, దక్షిణ కొరియా సాయాన్ని కిమ్‌ ఆశిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఉత్తర కొరియాతో విభేదాల పరిష్కారానికి స్వతంత్రంగా వ్యవహరించకుండా అమెరికా మద్దతు కోసం దక్షిణ కొరియా పాకులాడుతోందని కిమ్‌ వ్యాఖ్యానించారు. కిమ్‌ ప్రకటనపై దక్షిణ కొరియా స్పందించింది. ఉత్తర కొరియాతో చర్చలకు సిద్ధమేనని, పెండిరగ్‌ సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events