కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి చెన్నై లవ్‌స్టోరీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రీగౌరీ ప్రియ కథానాయిక. ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకుడు. సాయిరాజేష్ కథనందించడంతో పాటు ఎస్‌కేఎన్‌తో కలిసి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ను విడుదల చేశారు.

తొలి ప్రేమేం తోపు కాదు.. ఫస్ట్‌లవ్ ఫెయిలయితేనే బెస్ట్ లవ్ ఎక్కడో మొదలవుతుంది అనే హీరో సంభాషణతో మొదలైన గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంది. నాయకానాయికలు సముద్రపు ఒడ్డున కూర్చుని తొలి ప్రేమ గురించి మాట్లాడుకునే డైలాగ్స్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. ఈ సుదీర్ఘ జీవిత పయనంలో తొలిప్రేమ ఒక మజిలీ మాత్రమేనని, అదే చివరిది కాదనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని గ్లింప్స్‌ను చూస్తే అర్థమవుతున్నది. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కథ: సాయిరాజేష్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రవి నంబూరి.
