హీరో కిరణ్ అబ్బవరం నటించిన చిత్రం కె.ర్యాంప్ షూటింగ్ రామానాయుడు స్టూడియోలో మొదలైంది. హాస్య మూవీస్ సంస్థ అధినేత రాజేశ్ దండా ఈ సినిమా నిర్మిస్తున్నారు. జైన్స్ నాని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పూజా కార్యక్రమం అనంతరం నిర్మాత అనిల్ సుంకర కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మరో నిర్మాత దిల్ రాజు క్లాప్ ఇవ్వగా ముహూర్తపు షాట్ చిత్రీకరించారు. దర్శకుడు యోగి తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకులు విజయ్ కనకమేడల, రామ్ అబ్బరాజు, యదు వంశీ, , రచయిత ప్రసన్నకుమార్ స్ర్కిప్ట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, వంశీ నందిపాటి, సీనియర్ నటుడు నరేశ్ తదితరులు పాల్గొన్నారు.