కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం సెబాస్టియన్ పీసీ524. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కోమలీ ప్రసాద్, సువేక్ష హీరోయిన్లుగా నటించారు. బి.సిద్ధారెడ్డి, జయచంద్రా రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్ సంస్థ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ రేచీకటి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. రేచీకటి గల హీరోకి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుంది. రేచీకటితో ఇబ్బంది పడే ఓ పోలీస్ కానిస్టేబుల్ నైట్ డ్యూటీ ఎలా చేశాడు? రేచీకటి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అన్నదే ఈ చిత్ర కథ అని యూనిట్ పేర్కొంది. జిబ్రాన్ స్వరరచనలో ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తున్నది అని చెప్పారు. శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణి రఘువరన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ : జ్యోవిత సినిమాస్, కథ, దర్శకత్వం: బాలాజీ సయ్యపురెడ్డి. మార్చి 4న సినిమాని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
