Namaste NRI

సంక్రాంతికి కిష్టయ్య వస్తున్నాడు.. బాక్సాఫీస్‌ కొడతాడు

నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రం నా సామిరంగ. ఆషికా రంగనాథ్‌ కథానాయిక.  విజయ్‌ బిన్ని దర్శకుడు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ టీవీలు వచ్చాక ఇక సినిమాలెవరూ చూడ రు అన్నారు. ఫోన్లు వచ్చిన తర్వాతా అంతే అన్నారు. ఇప్పుడు ఓటీటీ అని కొత్తగా వచ్చినా, అన్నింటికీ మించి కొవిడ్‌ వచ్చినా సినిమాలకు ఆదరణ తగ్గలేదు. తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి అంటే సినిమా పండుగే.  మేము నా సామిరంగ తో వస్తున్నాం. సంక్రాంతికి కిష్టయ్య వస్తున్నాడు. బాక్సాఫీస్‌ కొడుతున్నాడు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని ప్రసంగం ముగించారు.

విజయ్‌ బిన్ని మాట్లాడుతూ కొత్త డైరెక్టర్‌గా నాకు ఇంత పేరు తెచ్చిపెట్టిన టీమ్‌ అందరికీ ధన్యవాదాలు. ఎన్నో సినీ వేడుకల్లో సామాన్యుల్లో ఒక్కడిగా పాల్గొన్న నేను డైరెక్టర్‌గా ఇప్పుడు ఈ స్టేజీ మీద డైరెక్టర్‌గా మాట్లాడుతు న్నందుకు ఆనందంగా ఉంది. నాగ్‌ సర్‌కి లైఫ్‌ లాంగ్‌ రుణపడి ఉంటాను అన్నారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events