Namaste NRI

కోల్ కతా దుర్గా పూజకు యునెస్కో గుర్తింపు

భారతీయ పండుగ వేడుకల్లో ఒకటైన దుర్గాపూజకు యునెస్కో గుర్తింపు లభించింది. సాంస్కృతిక వారసత్వ జాబితాలో దుర్గాపూజకు చోటు దక్కింది. పారిస్‌లో జరుగుతున్న యునెస్కో సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆసియాలో ఓ పండగకు ఇలాంటి గుర్తింపు రావడం ఇదే ప్రథమం. యునెస్కో నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క భారతీయుడూ గర్వపడే క్షణాలు. దుర్గా పూజ మన సంప్రదాయాలు, ఆచారాల్లో ఉత్తమైనది. ఈ పూజల అనుభవం ప్రతి ఒక్కరికీ కలగాలి అంటూ ట్వీట్‌ చేశారు.  పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ట్వీట్‌ చేస్తూ బెంగాల్‌కు గర్వించే సందర్భం. ప్రపచంలోని బెంగాలీలకు దుర్గా పూజ అంటే కేవలం పండగ కాదు. అందర్నీ కలిపే ఓ భావోద్వేగం అని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events