ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా కోమటి జయరాం బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎనఆర్‌టీఎస్) కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రాభివద్ధికి కోమటి జయరాం సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులు, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించేందుకు తోడ్పాటు అందిస్తారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించే విషయంలోనూ కృషి చేస్తారు అని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఏపీఎనఆర్‌టీఎస్ అధ్యక్షుడు వేమూరి రవి, సైన్స్ అండ్ టెక్నాలజీ చైర్మన్ మండలపు రవి, ఎన్నారై రాజా పల్లి, వివిధ దేశాలకు చెందిన ఎన్నారైలు పాల్గొన్నారు.















