కన్నడ అగ్రహీరో సుదీప్ నటించిన చిత్రం శివ కార్తిక్ తెరకెక్కించిన చిత్రం కే3 కోటికోక్కడు. శివ కార్తిక్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. కన్నడలో కే 3 చిత్రం విడుదలై నాలుగు రోజుల్లోనే దాదాపు 40 కోట్లు వసూలు చేసి సుదీప్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్లో సుధీప్ రెండు విభిన్న పాత్రల్లో మెప్పించారు. యాక్షన్, సెంటిమెంట్ అంశాలు ప్రధానంగా ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటాయి. సుదీప్, మడోన్నా సెబాస్టియన్ జోడీ చూడముచ్చటగా ఉంది. ట్రైలర్లో శ్రద్దాదాస్, రవి శంకర్ నవాబ్ షా తదితరులు కనిపించారు. యాక్షన్ ప్యాక్డ్గా రిలీజైన కే3 కోటీకొక్కడు తెలుగు ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఆషికా రంగనాథ్ ప్రత్యేక గీతంలో నర్తించింది. అఫ్తాబ్ శివ దాసాని, రవిశంకర్, నవాబ్ షా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శేఖర్ చంద్ర, సంగీతం: అర్జున్జెన్యా, నిర్మాణ సంస్థ : గుడ్ సినిమా గ్రూప్, నిర్మాత : శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే. గుడ్ సినిమా గ్రూప్ సంస్థ ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేస్తోంది.














