కరోనాకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. తేలికపాటి నుంచి మధ్య స్థాయి కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారికి చికిత్స కోసం రూపొందించిన క్లెవైరా యాంటీవైరల్ డ్రగ్‌కు ఆమోదం లభించిందని చెన్నైకి చెందిన ప్రముఖ సంస్థ అపెక్స్ లేబొరేటరీస్ ప్రకటించింది. క్లెవైరాకు భారత ప్రభుత్వ ఔషద నియంత్రణ సంస్థ నుంచి అనుమతి లభించినట్లు పేర్కొంది. ఈ ఔషధం సమర్థంగా తేలికపాటి నుంచి మధ్య స్థస్థ్రాయి లక్షణాలతో బాధపడే కోవిడ్ రోగులు త్వరగా కోలుకునేలా పనిచేస్తుందని సీసీఆర్‌ఏఎస్, ఎయిమ్స్, మాజీ ప్రొఫెసర్ డిపార్టుమెంట్ ఆఫ్ ఫార్మ కాలజీ డాక్టర్ ఎస్కే మాలిక్ చెప్పారు. క్లెవైరా యాంటీవైరల్ సామర్థ్యంతోనే కాకుండా అనాల్జసిక్, యాంటీపైరేటిక్, థ్రోంబోసైటోపెనియా నుంచి కోలుకునేందుకు రోగులపై సమర్థంగా పనిచేస్తున్నట్లు నిరూపితమైంది.