హీరో మంచు మనోజ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా ప్రకటించాడు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, గత వారం రోజులుగా తనను కసిన వాళ్లందరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనాను ఎదుర్కొనే పోరాటంలో ప్రతి ఒక్కరూ విధిగా అవసరమైన జాగ్రత్తలన్ని పాటించండి. తన గురించి ఎవరు ఆందోలన చెందాల్సిన అవసరం లేదని, తాను క్షేమంగానే ఉన్నానని తెలిపారు. ఎప్పటికీ మీ ప్రేమ, అశీర్వాదాలు తనతోనే ఉంటాయని, తనకు ఏమీ కాదన్నాడు. తనకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, నర్సులకు ధన్వవాదాలు తెలిపారు.














