కువైత్ జాతీయ దినోత్సవం సందర్భంగా వరుసగా సెలవులు రావడంతో ట్రాఫిక్ ఉల్లంఘనలు పెరిగే అవకాశం ఉన్నందున అంతర్గత మంత్రిత్వశాఖ ప్రవాసులు, నివాసితులకు తాజాగా కీలక సూచన చేసింది. ప్రవాసులు, కువైటీలు ట్రాఫిక్ గైడ్‌లైన్స్‌ను తప్పకుండా పాటించాలని సూచించింది. ఇక వేడుకల సందర్భంగా వాహనం మొత్తాన్ని కవర్ చేసేలా డెకరేషన్ చేయకూడదని తెలిపింది. ముఖ్యంగా వాహనం అద్దాలపై పెయింటింగ్స్ వంటివి వేయకూడదని చెప్పింది. అలాగే నంబర్ ప్లేట్‌పై కూడా ఎలాంటి స్టిక్కర్స్ అతికించకూడదు. స్పష్టంగా కనిపించే విధంగా ఉండాలని మంత్రిత్వశాఖ తెలిపింది. అంతేగాక వేడుకల సందర్భంగా వాహనాల కిటికీల నుంచి పిల్లలు బయటకు వేలాడడం, తొంగి చూడడం వంటి కూడా చేయకుండా పేరెంట్స్ జాగ్రత్త వహించాలని కోరింది. ఇతరులకు ఇబ్బంది కలగకుండా సేఫ్టీ రూల్స్ పాటించడం తప్పనిసరి అని మినిస్ట్రీ ఆఫ్ ఇంటరీయర్‌కు చెందిన పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది.